టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే.. అతను జట్టులో ఉండాల్సిందే?

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా దినేష్ కార్తీక్ ఆట తీరు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు దినేష్ కార్తీక్. అతని కెరీర్ ముగిసిపోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో టీం ఇండియా లో కీలక ఆటగాడిగా ఎదుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ ప్రతిభ గురించి స్పందిస్తున్న మాజీ ఆటగాళ్లు అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. మొన్నటివరకు ఐపీఎల్ లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఇప్పుడు సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ లో కూడా బెస్ట్ ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు.

 ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ లో కూడా దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దినేష్ కార్తీక్  ప్రపంచకప్ లో ఉండాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా మాజీ క్రికెటర్ల ఖాతాలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డెయిల్ స్టేయిన్  కూడా వచ్చి చేరాడు   ప్రస్తుత ఫామ్ ను బట్టి రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం మంచిది అని నా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో దినేష్ కార్తీక్ బాగా ఆడుతున్నాడు.

 కీలక ఆటగాళ్లు విఫలమవుతున్న సమయంలో  దినేష్ కార్తీక్ మాత్రం వచ్చిన ప్రతి   అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇక భారత జట్టు టి-20 ప్రపంచ కప్ గెలవాలంటే దినేష్ కార్తిక్ తప్పకుండా జట్టులో ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం దినేష్ కార్తీక్ తన కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అంటూ డేల్ స్టెయిన్  చెప్పుకొచ్చాడు. అటు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం దినేష్ కార్తీక్ ను అటు టి-20 ప్రపంచకప్ జట్టులో చూడాలని అనుకుంటున్నామూ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: