ఇది మా నాన్నకు అంకితం : ఆవేశ్ ఖాన్

praveen
ఇటీవలే టీమిండియాలో మంచి ప్రదర్శన చేసి సెలక్టర్ల చూపును ఆకర్షించిన యువ పేసర్ ఆవేశ్ ఖాన్ టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తుది జట్టులో కూడా అవకాశం దక్కించుకుని టీమిండియా తరఫున ఆరంగేట్రం చేశాడు ఈ యువ ఆటగాడు. తన వైవిధ్యమైన బౌలింగ్తో టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తాడు అనుకుంటే మొదటి మూడు మ్యాచ్ లలో కూడా ఎలాంటి వికెట్లు పడకుండా తీవ్ర నిరాశ పరిచాడు అనే చెప్పాలి. దీంతో గత మూడు మాసాల నుంచి ఆవిష్కరణ పెట్టి మరొకరిని జట్టులోకి తీసుకోబోతున్నారు అన్న చర్చ జరిగింది.

 అయితే ఇక వరుసగా 3 టీ20 లో ఒక వికెట్ కూడా పడలేక తీవ్రంగా నిరాశపరిచిన ఆవేష్ ఖాన్ 4వ టి20 మ్యాచ్ లో మాత్రం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఏకంగా నాలుగు ఓవర్లు వేసిన ఆవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.  కీలక సమయంలో వికెట్లు తీయడం కారణంగానే 22 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. ఇకపోతే 4వ టీ20 లో  ప్రదర్శన చేసిన తర్వాత ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆవేశ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

 ఇక నేడే మా నాన్న పుట్టిన రోజు కావడంతో ఈ ప్రదర్శన ఆయనకు అంకితం ఇస్తున్నాను అంటూ ఆవేశ్ ఖాన్  తెలిపాడు. అయితే ఈ మ్యాచ్లో నేను ఎలాంటి ప్రణాళికలు రచించి లేదు సహజసిద్ధంగా బౌలింగ్ చేశాను..  నేరుగా వికెట్లకు విసరాలి అని అనుకున్నాను. అయితే పిచ్ వైవిధ్యంగా ఉంది. కొన్నిసార్లు బంతి బౌన్స్ అయ్యింది. కొన్ని సార్లు కిందకి వెళ్ళింది. దీంతో కాస్త బౌన్స్ ప్రదర్శించి సరైన రీతిలో వేయాలని నిర్ణయించుకున్నారు. రిషబ్ పంత్ కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బౌలింగ్ చేయాలో ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాడు. దీంతో తాను అనుకున్నట్లుగానే వికెట్లు దక్కాయి అంటూ చెప్పుకొచ్చాడు ఆవేశ్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: