ఒక్క మ్యాచ్ లో.. ఇన్ని రికార్థులా.. వామ్మో?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్  నెదర్లాండ్స్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇప్పటివరకు అటు ప్రపంచ క్రికెట్లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో వన్డే ఫార్మాట్ లోనే అత్యధిక పరుగులు చేసి సరికొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇక మొదటి వన్డే మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టుపై ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్ పై సాధించిన ఈ విజయంతో పాటు ఇంగ్లాండ్ విజయోత్సాహంలో ఉంది.

 అదే ఈ సమయంలో ఒక్క వన్డే మ్యాచ్ తో అటు ఇంగ్లాండ్ జట్టు ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. ప్రపంచ క్రికెట్లో వన్డే క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. అంతేకాకుండా ఒక వన్డే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. నెదర్లాండ్స్   పై జరిగిన మ్యాచ్లో ఇరవై ఆరు సిక్సర్లు కొట్టింది ఇంగ్లండ్ జట్టు.

 ఇక గతంలో ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేయగా ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ 65 బంతుల్లో 150 పరుగులు చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎబి డివిలియర్స్  గతంలో 16 బంతుల్లో 50 పరుగులు చేయగా నెదర్లాండ్స్ పై జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లలో కూడా సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇలా నెదర్లాండ్స్ పై జరిగిన ఒకే ఒక్క వన్డే మ్యాచ్ తో ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఇంగ్లాండ్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: