కెప్టెన్ రిషబ్ పంత్ 'వీక్ నెస్' ను అధిగమిస్తాడా ?

VAMSI
సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉంది. ఇక్కడ మొత్తం అయిదు టీ 20 లు ఆడనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా మూడు మ్యాచ్ లలోనూ సౌత్ ఆఫ్రికా నే మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ లో ఇండియా 1-2 తో వెనుకబడి ఉంది. ఢిల్లీ మరియు కటక్ లలో ఇండియా ఓటమై పాలు కాగా, వైజాగ్ లో మాత్రం రిషబ్ పంత్ తనకు ఉన్న బౌలింగ్ వనరులను సరిగా వాడుకుని విజయాన్ని సాధించాడు. దీనితో సిరీస్ ఇంకా సజీవంగానే ఉంది. ఇండియా ఈ సిరీస్ ను గెలుచుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలోనే గెలవాల్సి ఉంది. కానీ సౌత్ ఆఫ్రికా ఏదైనా ఒకటి గెలిస్తే చాలు సిరీస్ ను దక్కించుకుంటుంది.

ఈ రోజు రాజ్ కోట్ లో డే నైట్ మ్యాచ్ జరగనుంది. ఇండియా గత మ్యాచ్ లో ఆడిన టీం ను కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. అయితే ఇది ఇండియాకు డు ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మరోసారి టాస్ కీలకంగా మారనుంది. పంత్ ఈ మ్యాచ్ లో అయినా టాస్ గెలుస్తాడా అన్నది చూడాలి.

ఇక  కెప్టెన్సీ భారం పంత్ వీరోచిత బ్యాటింగ్ కు అడ్డుగా మారుతోందా అన్నది ఇక్కడ అందరూ ఆలోచిస్తున్న విషయం. అయితే ఇది కొందరి ఆటగాళ్ల విషయంలో నిజమే అయినా ? పంత్ ను మాత్రం ఇవేమీ అడ్డుకోలేవని పలువురు సీనియర్ ఆటగాళ్లు అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ లో మినహా మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ పంత్ అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు . ముఖ్యంగా ఆఫ్ సైడ్ అవతల వేసే బంతులకు టెంప్ట్ అయిపోయి అవుట్ అవుతున్నాడు.  అయితే పంత్ షాట్ సెలక్షన్ మార్చుకుని ఆడితే పరుగులు సాధించడం కష్టం కాదని తెలుస్తోంది. మరి పంత్ ఈ రోజు కీలకం అయిన మ్యాచ్ లో రాణించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషిస్తాడా అన్నది చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: