నాలుగో టి20.. టీమిండియా ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులు?
ఇక ఈ టీ20 మ్యాచ్లో కూడా భారత జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండగా.. మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టు నాలుగవ టి20 మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ సేన సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక నాలుగవ టి20 మ్యాచ్ అటు పలువురు భారతీయ ఆటగాళ్లను అరుదైన రికార్డును ఊరిస్తున్నాయి అనే చెప్పాలి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరో సిక్సర్ బాధ్యతే చాలు రిషబ్ పంత్ తన కెరీర్లో వంద సిక్సర్లు బాదిన ఆటగాళ్ల క్లబ్బులో చేరిపోతాడు. ఇక దినేష్ కార్తీక్ మరో 64 పరుగులు చేస్తే టీ20 లలో 5000 పరుగులను పూర్తి చేసుకుంటాడు.
భువనేశ్వర్ కుమార్ మరో నాలుగు వికెట్లు పడ గొట్టాడు అంటే టి-20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. ఇక పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు అక్షర్ పటేల్ ఒకే ఒక్క వికెట్ దూరం లో ఉండడం గమనార్హం. ఇలా పలువురు క్రికెటర్లను రికార్డులు ఊరిస్తూన్న నేపథ్యం లో నాలుగో టి20 మ్యాచ్ లో రికార్డులను బ్రేక్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరం గా మారి పోయింది.