ఒడిశా ఎలా ఉందన్న ప్రశ్నకు.. సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే టీమిండియాతో ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ టి 20 సిరీస్ లోని 5 మ్యాచ్లను కూడా బీసీసీఐ ఒకే వేదిక లో కాకుండా ఐదు వేర్వేరు వేదికలలో నిర్వహించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగింది.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక రెండో మ్యాచ్ ఒరిస్సాలోని కటక్ కు వేదికగా జరగబోతుంది ఇక నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే అటు టీమ్ ఇండియా, సౌత్ఆఫ్రికా జట్ల ఆటగాళ్లు ఒడిషాలోని కటక్ వేదికకు చేరుకున్నారూ అనే చెప్పాలి. ఇలా అక్కడికి చేరుకున్న ఇరు జట్లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ వేన్ పార్నల్ ను ఒడిశాకు చెందిన జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాడు. ఒడిస్సా కి మొదటిసారి వచ్చారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి.. ఎలా ఫీలవుతున్నారు అంటూ ప్రశ్నించగా.. ఇక్కడ ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాం.. అయితే నేను ఇండియా కి రావడం కూడా ఇదే మొదటిసారి అంటు సమాధానం చెప్పాడు.


 ఇక ఇండియాలో నాకు నచ్చే విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి క్రికెట్ అయితే మరొకటి ఇక్కడ క్రికెటర్లకు ఇచ్చే ఆతిథ్యం అంటూ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ రిప్లై ఇచ్చాడు. ఇకపోతే కటక్  వేదికగా జరుగుతున్న రెండో టి-20 మ్యాచ్ లో తప్పకుండా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది ఇండియా. అదే సమయంలో రెండవ మ్యాచ్  లో కూడా గెలిచి  మరింత ఆధిక్యాన్ని సాధించాలని భావిస్తోంది సౌత్ ఆఫ్రికా. ఇక ఏం జరగబోతుంది అన్నది మాత్రం మ్యాచ్ ప్రారంభం అయ్యాకే తెలుస్తుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: