ప్రపంచ నెంబర్-1 కావడమే నా కల : బాబర్

praveen
గత కొన్నేళ్ల నుంచి పాకిస్థాన్ క్రికెట్ లో నాణ్యమైన నిలకడ గల ఆటగాళ్లు ఎవరూ తెరమీదికి  రావడం లేదు అని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ ఇటీవలి కాలంలో  ఎంతో మంది అత్యుత్తమ ప్లేయర్లు పాకిస్తాన్ క్రికెట్ లో కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి అత్యుత్తమ ప్లేయర్లో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒక వైపు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే మరోవైపు ఒక ఆటగాడిగా కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొడితే ఇక విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిన రికార్డులను అటు బాబర్ అజాం తిరగరాస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో అద్భుతమైన ప్రదర్శనతో రికార్డుల వేట ప్రారంభించి అదరగొడుతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్ గా కూడా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా తాను భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్లో ఎలాంటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నాడో అన్న విషయాన్ని చెబుతూ మనసులో మాట బయట పెట్టాడు.


 3 ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా కావడమే తన కల అంటూ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం చెప్పుకొచ్చాడు. ఇందుకోసం ఊహించిన దానికంటే ఎక్కువ హార్డ్వర్క్ చేయాల్సి ఉంటుందని ముఖ్యంగా ఫిట్ నెస్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటూ తెలిపాడు. ప్రస్తుతం వన్డేలు టి20 లలో నిలకడగా రాణిస్తున్నానని  ఇక రానున్న రోజుల్లో టెస్టు క్రికెట్ లోనూ జోరు కొనసాగిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఐసిసి ర్యాంకింగ్స్ లో వన్డే టి20 ఫార్మాట్ క్రికెట్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న  బాబర్ అజాం టెస్టు ఫార్మాట్లో మాత్రం ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: