సెంచరీ చేస్తేనే జట్టులో చోటు : అజారుద్దీన్

praveen
భారత టెస్ట్ క్రికెట్ లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించుకున్నాడు చటేశ్వర్ పుజారా, హనుమ విహారి. ఇక ప్రతి సారి కూడా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తమదైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చే వారు ఇద్దరు ఆటగాళ్ళు. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా కొన్నాళ్లపాటు వీరికి వరుసగా అవకాశాలు ఇచ్చి చూసింది. కానీ వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడంతో ఇక వీరిని టీమిండియా పక్కనపెట్టేసింది అన్న విషయం తెలిసిందే.


 మళ్లీ ఫామ్ నిరూపించుకున్న తర్వాత టీమిండియా జట్టులో చోటు కల్పిస్తాం అని తెలిపింది. అయితే మళ్లీ ఫామ్ నిరూపించుకునేందుకు  చటేశ్వర్ పుజారా, హనుమ విహారి బాగానే కష్టపడ్డాడు. అటు రంజీ మ్యాచ్లో ఆడటంతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ లలో కూడా ఆడాడు. చటేశ్వర్ పుజారా రంజీ మ్యాచ్లో అంతంత మాత్రంగానే ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ కౌంటీ లలో మాత్రం ఏకంగా సెంచరీలతో చెలరేగి పోయాడు నాలుగు మ్యాచ్ లలో ఏకంగా రెండు సెంచరీలు 2 డబుల్ సెంచరీతో అదరగొట్టాడు చటేశ్వర్ పుజారా.


 ఈ క్రమంలోనే జూలై నెలలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో ఆడబోయే చివరి టెస్ట్ కోసం ఇక బీసీసీఐ అటు  పుజారా తో  పాటు హనుమ విహారి కి కూడా జట్టులో స్థానం కల్పించింది. ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో టీమిండియా ఆడబోయే మ్యాచ్ లో పూజారా ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తి నెలకొంది అంటూ చెప్పుకొచ్చాడు. జట్టులో స్థానం కోసం వీరి మధ్య పోటీ నెలకొనడం తో హనుమ విహారి కేవలం యాభై, 60 పరుగులు మాత్రమే చేస్తే సరిపోదని సెంచరీలతో అదరగొట్టాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ పరుగులు చేస్తే జట్టులో చోటు కష్టమే అంటూ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: