అతను బౌలింగ్ కు ప్యాంటు తడిసిపోయేది : ముంబై హెడ్ కోచ్
వన్డే టి20 ఫార్మాట్ లోనే కాదు టెస్టుల్లో అయితే అటు బౌలర్లు అందరికీ కూడా కొరకరాని కొయ్యగా మహేళ కొనసాగుతూ ఉండే వాడు. ఇక ఇలాంటి దిగ్గజ బ్యాట్స్మెన్ ఒక బౌలర్ ను చూస్తే మాత్రం ఎంతో భయపడిపోయాడట. ఆ బౌలర్ తనకు బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు జడుసుకునే వాడిని మహేళ జయవర్ధనే బాగా భయపడ్డాడట. ఆ బౌలర్ ఎవరో కాదు పాకిస్తాన్ ఫేసర్ వసీం అక్రమ్ కావడం గమనార్హం. వసీం అక్రమ్ కారణంగా తాను ఎంతో భయపడేవాడినని.. అతడి వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాను అంటూ మహేళ జయవర్ధనే ఇటీవలే ఐసిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
కెరీర్లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో వసీం అక్రమ్ ఒకరని. అతని బౌలింగ్ కూడా ఎప్పుడు నాకు సవాలుగా ఉండేది. అతను బౌలింగ్ నాకు ఒక పీడకలలా ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు. ఫార్మెట్ ఏదైనా అతడు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడని బంతి వేగానికి నేను భయపడేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.. మహేళ జయవర్ధనే కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. కాగా పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ కెరీర్లో 916 వికెట్లు పడగొట్టాడు. 104 టెస్టులు కూడా ఆడి రికార్డు సృష్టించాడు. 356 వన్డేలు వారి 502 వికెట్లు పడగొట్టాడు సదరు ఆటగాడు.