
ఐపీఎల్ : సీజన్ల వారీగా.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు ఇవే?
ఇక ఎంతో మంది ఆటగాళ్లు మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో ఒక్క అడుగు దూరంలో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. కానీ ఎన్నో అవార్డులు కొట్టింది. ఆరెంజ్,పర్పుల్ క్యాప్ సాధించిన ఆటగాళ్లు ఈ జట్టు లోనే ఉన్నారు. ఎక్కువ సిక్సర్లు సాధించిన బ్యాట్స్మెన్ ఈ జట్టు లోనే ఉన్నాడు. మొత్తంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టుగా కూడా రాజస్థాన్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అన్ని ఐపీఎల్ సీజన్ లలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్లు ఏంటో తెలుసుకుందాం..
ఐపీఎల్ ప్రారంభ సీజనే 2008లో పంజాబ్ జట్టు 96 సిక్సర్లతో ఎక్కువ సిక్సర్లు కొట్టి జట్టుగా నిలిచింది. ఆ తర్వాత 2009లో హైదరాబాద్ 99 సిక్సర్లు, 2010లో చెన్నై 97 సిక్సర్లు, 2011లో ఆర్సిబి 94 సిక్సర్లు, 2012లో ఆర్సిబి 117 సిక్సర్లు, 2013లో ముంబై 117 సిక్సర్లు, 2014లో పంజాబ్ 120 7 సిక్సర్లు, 2015లో ముంబై నూట ఇరవై ఆరు సార్లు, 2016లో ఆర్సిబి 142 సిక్సర్లు, 2017లో ముంబై 117 సిక్సర్లు, 2018లో చెన్నై 145 సిక్సర్లు, 2019లో కోల్కతా 143 సిక్సర్లు, 2020లో ముంబై 137 సిక్సర్లు, 2021లో చెన్నై 115 సిక్సర్లు, 2022 లో రాజస్థాన్ 137 సిక్సర్లతో సీజన్ల వారీగా అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుగా ఉన్నాయి.