అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం : రషీద్ ఖాన్

praveen
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న నాణ్యమైన స్పిన్ బౌలర్ లలో రషీద్ ఖాన్ మొదటి వరుసలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. పసికూన లాంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అతని టాలెంట్ తో అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా గుర్తింపు సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్మెన్ లు సైతం రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఆడటానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ సిక్సర్లతో చెలరేగిపోతున్న వారు సైతం రషీద్ ఖాన్ బౌలింగ్ పరుగులు చేయడానికి కాదు వికెట్ కాపాడుకోవడానికి తంటాలు పడుతుంటారు.


 అందుకే టీ-20 ఫార్మెట్లో రషీద్ ఖాన్ తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి ఎన్నో రికార్డులు నెలకొల్పాడు అని చెప్పాలి. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా తన సత్తా చాటాడు రషీద్ ఖాన్. గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్ 16 మ్యాచ్ లలో 6.59 ఎకానమీలో 19 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఎప్పుడూ తన స్పిన్ బౌలింగ్ తో భారీ సిక్సర్లు కొట్టే బ్యాట్స్మెన్లను  సైతం భయపెట్టే రషీద్ ఖాన్.. ఒక బ్యాట్స్ మాన్ కి బౌలింగ్ చేయడం మాత్రం చాలా కష్టం అంటూ చెబుతున్నాడు.



 ఇక ఆ బ్యాట్స్మన్ ఎవరో కాదు గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్  అతనికి బౌలింగ్ చేయడం కష్టం అంటూ తెలిపాడు. అతనితో కలిసి ఆడి నందుకు చాలా గర్వంగా ఉంది. అతను చాలా కష్టపడతాడు. మిగతా ఆటగాళ్లలో ఎప్పుడు ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు  అతడి వద్ద ఉన్నందుకు సంతోషంగా ఉంది. టోర్నమెంట్లో   అతను ఆడిన తీరు నమ్మశక్యంగా లేదు. ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. కానీ అదృష్టవశాత్తు మేము ఇద్దరం ఒకే జట్టు లో ఉన్నాము అంటూ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: