షాకింగ్ : పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్లు?

praveen
సాధారణం గా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం అందరూ చూసే ఉంటారు. ఇటీవలి కాలం  లో మాత్రం చిత్రవిచిత్రమైన పెళ్ళిళ్ళు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ప్రకృతి విరుద్ధం గా ఏకంగా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా అందరినీ ఆశ్చర్య పోయేలా చేస్తున్నాయి.  మరికొన్ని సార్లు ఇద్దరు అమ్మాయిలు ప్రేమ లో మునిగి తేలి  ఇక పెళ్లితో ఒక్కటవ్వటం లాంటి ఘటనలు  కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమం లోనే ఇక ఇటీవలే ఏకంగా ఇద్దరు మహిళా క్రికెటర్లు కూడా ఇలాంటిదే చేసి అందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తారు . ఇటీవలే సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉండటం చూసాము అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే నిజం చేసి చూపించారు ఇద్దరు మహిళా క్రికెటర్. ప్రస్తుతం ఇంగ్లాండ్ మహిళా జట్టు క్రికెటర్లు కేథరిన్ బృంట్, నాట్ స్కీవర్ కొన్నేళ్లుగా ప్రేమ లో మునిగి తేలుతున్నారు. ఇక వీరి ప్రేమకు సంబంధించి ఎన్నో ఫొటోలు వీడియోలను కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉండేవారు.


 ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని మరోసారి సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారి పోయారు అని చెప్పాలి. ఇద్దరు మహిళా క్రికెటర్లు కూడా వివాహ బంధంతో ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మ్యారేజ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారిణి ఈసా గుహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కేథరిన్ బృంట్, నాట్ స్కీవర్ ల  పెళ్లి గురించి స్పందిస్తూ శుభాకాంక్షలు కూడా చెప్పడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: