హమ్మయ్య.. కోహ్లీ రికార్డు పదిలంగానే ఉంది?

praveen
ఏడాది ఐపీఎల్ సీజన్ లో జాస్ బట్లర్ మొదటి మ్యాచ్ నుండి ఎంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున కాదు అటు ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఒక రకంగా రాజస్థాన్ ఫైనల్కు చేరింది అంటే అది జోస్ బట్లర్ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు బట్లర్. అతను సరిగ్గా రాణించనీ రోజు అటు రాయల్స్ జట్టు ఓటమి చవి చూస్తూ వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో కూడా జోస్ బట్లర్ ఎక్కువ పరుగులు చేయడంలో విఫలమవడంతో చివరికి రాజస్థాన్కు ఓటమి తప్పలేదు.


 కేవలం 39 పరుగులు మాత్రమే చేసిన బట్లర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో కూడా జోస్ బట్లర్ మరో సెంచరీ చేసి అదర కొడతాడు అని అందరూ అనుకున్నారు. విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొడతాడు అని అందరూ భావించారు. కానీ 39 పరుగుల వద్ద  వికెట్ కోల్పోయాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డ్ పదిలంగానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే మొత్తంగా 17 మ్యాచ్ లలో 863 పరుగులు చేసిన జాస్ బట్లర్.. 2016లో 848 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో టాప్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2016లో 973 పరుగులు చేశాడు.


 ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్  జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అనే చెప్పాలి. ఎన్నో గాయాలు సర్జరీలు ఉద్వాసన విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఎంతో అద్భుతంగా పుంజుకొని ఒక ఆటగాడిగా నిరూపించుకోవడమే కాదు జట్టు సారథిగా నిలదొక్కుకున్న తీరు మాత్రం ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడిని ఫిదా అయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: