లివింగ్ స్టోన్ కొడితే స్టేడియం బయటకు వెళ్లాల్సిందే.. వైరల్ వీడియో?

praveen
ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ తన బ్యాటింగ్ తో ఎంతలా మెరుపులు మెరిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 117 మీటర్ల సిక్సర్ కొట్టి అతిపెద్ద సిక్సర్ కొట్టిన బ్యాట్స్మెన్గా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలీ. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే అఫ్ లో అడుగు పెట్టకుండానే ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో  మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు నుండి బయటికి వచ్చిన లివింగ్ స్టోన్ ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ లో ఆడుతున్నాడు.


 అక్కడ కూడా తన అద్భుతమైన ప్రదర్శన తో అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఐపీఎల్ తరహాలోనే ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్ లో కూడా భారీ సిక్సర్ కొట్టి  మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 బ్లాస్ట్ లో భాగంగా లాక్ షైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా యార్క్ షైర్ తో జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్ ఒక భారీ సిక్సర్ కొట్టగా ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. లాంక్ షైర్ ఇన్నింగ్స్ సమయంలో 12 ఓవర్ వేసాడు మాథ్యూ రెవిస్. అతని బౌలింగ్ లో ఆఖరి బంతి లివింగ్స్టోన్ సిక్సర్ కొట్టాడు. బంతి స్టేడియం బయట పడటం గమనార్హం.


 ఇందుకు సంబంధించిన వీడియోని టీ20 బ్లాస్ట్ మేనేజ్మెంట్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం ఇది క్రికెట్ అభిమానులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో. ఈ మ్యాచ్లో మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న లివింగ్ స్టోన్ 23 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. కాగా ఐపీఎల్లో లివింగ్ స్టోన్ బ్యాటింగ్  ఎంజాయ్ చేసిన అభిమానులు సైతం ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లివింగ్ స్టోన్ ఒక్కసారి బ్యాట్ జులిపిస్తే  అంతే బంతి స్టేడియం బయటికి వెళ్లాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: