ఐపీఎల్ : వేలంలో పట్టించుకోలేదు.. కట్ చేస్తే?
దీంతో అతన్ని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అయితే చివరి నిమిషంలో డేవిడ్ మిల్లర్ ను గుజరాత్ టైటాన్ జట్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే అతని కోసం పోటీపడి గుజరాత్ టైటాన్స్ మూడు కోట్లకు దక్కించుకుంది. అతనిపై నమ్మకం ఉంచి కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుస అవకాశాలు ఇచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ ఆ తర్వాత మాత్రం బ్యాటింగ్ విభాగంలో ఎంతో కీలకంగా మారిపోయాడు. 15 మ్యాచ్ లలో 450 పరుగులు సాధించాడు. ప్రతి మ్యాచ్ లో కూడా తన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు.
ఇటీవల తన బ్యాటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్లో నా బ్యాటింగ్ చూస్తుంటే నాకు నేను రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే నా బ్యాటింగ్ లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందుకే గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ప్రతి మ్యాచ్ లో కూడా నా పేరు తెర మీదికి వచ్చింది. 4, 5 ఏళ్లలో నా కెరియర్ లో అత్యంత చెత్త ఫాం లో ఉన్నాను. ముఖ్యంగా 2016 ఐపీఎల్ సీజన్ నాకు ఒక పీడకల లాంటిది. ఈ సీజన్లో తర్వాత మళ్లీ ఐపీఎల్లో ఛాన్స్ రాదు అని అనుకున్నాను. బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ మునుపటి ఫామ్ అందుకున్నాను అంటు డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు.