క్వాలిఫైయర్-2 మ్యాచ్ కు ముందు.. దినేష్ కార్తీక్ కు వార్నింగ్?

praveen
ఇప్పటికే సీనియర్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకునీ టీమిండియాలో చోటు కోల్పోయిన దినేష్ కార్తీక్ ఇక కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ అదర కొడుతున్నాడు.  ఒక రకంగా ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చిన సూపర్ స్టార్ లలో అటు దినేష్ కార్తీక్ కూడా ఒకరు. మరికొన్ని రోజుల్లో దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్న సమయంలో ప్రతి మహిళ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ తనలో ఉన్న ఫినిషర్ ని అందరికీ నిరూపిస్తున్నాడు.

 టీమిండియాలో చోటు దక్కించుకోవాలనే కసి ఇంకా తనలో అలాగే ఉంది అంటూ తన ఆటతీరుతో నిరూపిస్తున్నాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న దినేష్ కార్తీక్ జట్టు విజయంలో ఎంత కీలక పాత్ర వహిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసి పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.

 అయితే రాజస్థాన్ తో జరిగిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ కు ముందు బెంగళూరు హిట్టర్ దినేష్ కార్తీక్ కు ఐపీఎల్ నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు అన్న వార్త  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో దినేష్ కార్తీక్ ప్రవర్తనా నియమావళి 1 ఉల్లంఘించినట్లు ఇక ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ దే అయితే తుది నిర్ణయమని తెలిపారు. దినేష్ కార్తీక్ ఏం చేయడం వల్ల నిబంధన ఉల్లంఘించినట్లు అయింది అన్న విషయాన్ని మాత్రం ఐపీఎల్ నిర్వాహకులు చెప్పకపోవడం చెప్పకపోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: