ఆ టైంలో బౌలింగ్ అంటే ఇష్టం : హర్షల్ పటేల్

praveen
ఈ ఏడాది పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక చివరికి ముంబై ఇండియన్స్ కారణంగా అదృష్టం కలిసి వచ్చి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది.  కానీ ప్లే ఆఫ్ లో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో తో విజయం సాధించి ప్రస్తుతం రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ కు సిద్ధమైంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే బెంగళూరు జట్టు విజయంలో అటు హర్షల్ పటేల్ ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్నో తో మ్యాచ్లు హర్షల్ పటేల్ 18 ఓవర్లో సూపర్ బౌలింగ్ చేయడం కారణంగానే జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు నేడు జరగబోయే రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో కూడా హర్షల్ పటేల్ ఎంతో కీలకంగా మారబోతున్నాడు. ఇక లవ్ మ్యాచ్ తర్వాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు హర్షల్ పటేల్. ఈ క్రమంలోనే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంపై ఇటీవల హర్షల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డెత్ ఓవర్లలో  బౌలింగ్ చేయడం ఎప్పుడూ ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఆ ఒత్తిడి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే  బౌలర్ ఒత్తిడి లోనే సూపర్ బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. లక్నో తో అదే సాధించాను. గత 2, 3 ఏళ్లుగా హర్యానా తరఫున డెత్ ఓవర్లు బౌలింగ్ చేస్తూ ఎంతగానో రాటుతేలాడు. ఐపీఎల్ లో కూడా అలాంటి సందర్భాల్లోనే ఐపీఎల్ బౌలింగ్ కొనసాగించాలని అనుకున్నాను అంటూ హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఒత్తిడిని  ఎంతో ఛాలెంజ్ గా స్వీకరిస్తాను అంటూ తెలిపాడు.

 ఇక ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ తో కలిసి కొత్త బంతిని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. హర్షల్ పటేల్ అయితే ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. హర్షల్ పటేల్ అటు రానున్న రోజుల్లో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం గా మారిపోతున్నాడు అని పలు వురుమాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే...

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: