అయ్యబాబోయ్.. పుట్టగొడుగులు ప్రాణాలు తీస్తున్నాయి?
ఎందుకంటే ఇటీవలే చైనాసరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఎవరూ ఊహించని విధంగా అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పుట్టగొడుగులు తిని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అని తెలుస్తోంది. అయితే అక్కడి ప్రజలందరూ కూడా ఇలా పుట్టగొడుగులు తినటం ఎన్నో ఏళ్ల నుంచి అక్కడి ప్రజలకు అలవాటు అయింది. కానీ గత రెండు సంవత్సరాల నుంచి మాత్రం కేవలం పుట్టగొడుగులు తినటం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
దాదాపు ఏడాదికి 80 మంది నుంచి 100 మంది వరకు కూడా ఇలా కేవలం పుట్టగొడుగులు తింటూ ప్రాణాలు కోల్పోతూ ఉండడం మాత్రం సంచలనంగా మారిపోయింది. చైనా భారత్ పై కుట్రలో భాగంగా ఎన్నో ప్రయోగాలు చేస్తుందని.. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు అస్సాం ప్రాంతంలో పుట్టగొడుగులు కారణంగా ప్రాణాలు కోల్పోవడం కూడా చైనా చేసిన కుట్ర అని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా 100 మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.