
లేక లేక ఒక కోరిక కోరిన కోహ్లీ.. రోహిత్ తీరుస్తాడో లేదో?
ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కానీ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాలంటే అటు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించాలి. ఎందుకంటే ప్రస్తుతం బెంగళూరు రన్ రేట్ -0.253 గా ఉంది ఢిల్లీ 0.255 గా ఉంది. ప్రస్తుతం 14 మ్యాచ్ లలో బెంగుళూరు ఎనిమిది విజయాలు సాధించగా.. అదే సమయంలో 7 విజయాలతో ఐదవ స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ముంబై తో జరగబోయే మ్యాచ్ లో ఢిల్లీ ఎనిమిదో విజయం సాధిస్తే బెంగళూరు జట్టు ఇంటి బాట పట్టాల్సిందే.
ఈ క్రమంలోనే రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ ఒక కోరిక కోరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించాలని అడిగాడు. తాను ముంబై ఇండియన్స్ అభిమానిగా మారిపోయాను అంటూ తెలిపాడు. తాను మాత్రమే కాదు డుప్లెసిస్ సైతం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానిగా మారిపోయామని రోహిత్ కు తమ పూర్తి మద్దతు ఉంది అంటూ ప్రకటించారు తామిద్దరం మాత్రమే కాకుండా జట్టులోని 25 మంది మద్దతు కూడా ముంబై ఇండియన్స్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు కోహ్లీ కోరికను మన్నించి రోహిత్ కోరిక తీరుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది..