హైదరాబాద్ ఆట గతి తప్పింది : మహమ్మద్ కైఫ్
ఇక 11 మ్యాచ్ లలో 5 విజయాలు 6 ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కి పడిపోయింది. అయితే ప్రస్తుతం మిగిలిన మూడు మ్యాచ్ లలో తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తేనే ప్లే ఆఫ్ లో ఛాన్స్ దక్కించుచుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇటీవలే సన్రైజర్స్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడున్న హైదరాబాద్ జట్టు బౌలింగ్ పరంగా పటిష్టమైన జట్టు ఏమీ కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎందుకంటే గత మ్యాచ్ లో కీలకమైన జాన్సన్ ను తీసుకోలేదు. అతనికి బదులు కార్తీక్ త్యాగికీ తుది జట్టులో అవకాశం ఇచ్చారు.
ఇక కొత్త బౌలర్లను తీసుకున్నప్పటికీ ఎందుకో జట్టు మాత్రం బలంగా కనిపించలేదు. 5 మ్యాచ్ ల తర్వాత వరుసగా ఓడిన రెండు మ్యాచ్ లలో నలుగురు ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారు. ఇక ఈ నలుగురు గత మ్యాచ్లను గెలిపించారు. ప్రస్తుతం జట్టులో జాన్సన్ లేడు అదే సమయంలో ఉమ్రాన్ మాలిక్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు అంటూ మహమ్మద్ కైఫ్ ఇక హైదరాబాద్ ప్రదర్శనపై తన విశ్లేషణ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచులో కోల్కత నైట్రైడర్స్ పై హైదరాబాద్ గెలుస్తుందో లేదో చూడాలి..