అతను జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు తీయడు : వీరేంద్ర సెహ్వాగ్

praveen
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఎన్నో ఏళ్ల నుంచి కీలకమైన బౌలర్గా కొనసాగుతున్న  బ్రావో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే క్లిష్ట సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉండేవాడు.  కానీ ఎందుకో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఎక్కువగా ఆకట్టుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా పడగొట్టే లేకపోయాడు బ్రావో. ఇటీవలే  ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఘోర పరాజయం పాలైంది.

 అయితే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ను పవర్ ప్లే లోనే కష్టాల్లోకి నెట్టాడు యువ బౌలర్ ముఖేష్ చౌదరి. వరుసగా మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత బౌలింగ్ చేసిన సీనియర్ బౌలర్ బ్రావో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాడు. జట్టుకు ఎంతో అవసరమైన సమయంలో వికెట్లు తీయకుండా పేలవ ప్రదర్శన చేశాడు. అది టీ20 లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు బ్రావో.

అతను ఇలాంటి ప్రదర్శన చేయడంపై కొంతమంది మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు అవసరమైనప్పుడు బ్రావో వికెట్లు తీయడు అంటూ చెప్పుకొచ్చాడు. ముంబై తో జరిగిన మ్యాచ్ లో బ్రావో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.  ముఖేష్ చౌదరి మూడు వికెట్లు తీస్తే సీనియర్ బౌలర్ టీ20 లో అత్యధిక వికెట్లు తీసిన బ్రావో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అందుకే అవసరమైనప్పుడు వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నిస్తే అతను వికెట్లు తీస్తాడు. ముంబై తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. బ్రావో బౌలింగ్లో ముంబై బ్యాట్స్మన్లు ఏ మాత్రం రిస్కు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: