జడేజాను పక్కకు పెట్టేసారా.. చెన్నైలో ఏం జరుగుతుంది

praveen
అసలు చెన్నై సూపర్ కింగ్స్ లో ఏం జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక అభిమాని లో ఇలాంటి ప్రశ్న నెలకొంది. ఇప్పటి నుంచి కాదు ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతూనే ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజా కు కెప్టెన్సీ అప్పగించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కొనసాగించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఆ తర్వాత జడెజా కెప్టెన్సీ నుంచి తప్పుకుని ధోనికి మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించాడు. దీంతో అందరూ అయోమయంలో మునిగిపోయారు.


 అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి.  సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా ఇక ఈ మ్యాచ్ లో కనిపించలేదు. ప్లే ఆప్  కి అర్హత సాధించాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం.  కానీ కీలకమైన ఆటగాడు అయిన రవీంద్ర జడేజా జట్టులో కనిపించకపోవడమే ఏంటి అన్న దానిపై మాత్రం అనుమానాలు తెరమీదకు వచ్చాయి. ఈక్రమంలోనే రవీంద్ర జడేజాను తప్పించడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై మహేంద్రసింగ్ ధోని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.


 రవీంద్ర జడేజా ఫిట్ గా లేడని అందుకే ఆడటం లేదని ధోనీ చెప్పుకొచ్చాడు. అయితే జడేజా ఫిట్ గా లేడు అన్నది చెప్పాడు తప్ప అసలు  జడేజా సమస్య ఏంటి అన్నది మాత్రం ధోని తెలియజేయలేదు. దీంతో ఎంతో మంది ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సంబంధిత అధికారికి సోషల్ మీడియా ఖాతాల నుంచి రవీంద్ర జడేజాను ఫాలో చేశారు. దీంతో గాయం అయితే ఫిట్ గా లేకపోతే సోషల్ మీడియా నుంచి ఎందుకు తీసేస్తారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో రవీంద్ర జడేజాను పూర్తిగా పక్కన పెడతారు అనే అనుమానాలు కూడా తెరమీదకు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: