అయ్యో కోహ్లీ.. మళ్ళీ మళ్లీనా?

praveen
గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవా ఫాంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పరుగుల వీరుడు గా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఈ ఏడాది మాత్రం కనీస పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు డకౌట్ అవుతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు విరాట్ కోహ్లీకి రెస్ట్ అవసరమని ఇక రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తే బాగుంటుందని కొంతమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. మరోవైపు ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే ఆటతీరు కనబరిచాడు విరాట్ కోహ్లీ. 67 పరుగులు తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. బెంగళూరు జట్టు విజయం సాధించింది అన్న దానికంటే విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్ అయ్యాడు అంటూ ఎంతో మంది అభిమానులు ఫీల్ అవుతున్నారు.

 కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏంటి కోహ్లీ గాడిలో పడతావు అనుకుంటే రోజు రోజుకీ అధ్వానం గా మారి పోతున్నాయి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఈ విధంగా గోల్డెన్ డక్ అవుట్ అవ్వడం ఐపీఎల్ చరిత్రలో ఆరోసారి కావడం గమనార్హం. ఈ సీజన్లోనే ఇది మూడోసారి డక్ ఔట్ కావడం గమనార్హం. సన్రైజర్స్ బౌలర్లలో చేతిలో రెండు సార్లు డక్ ఔట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. వరుసగా విరాట్ కోహ్లీ డకౌట్ అవుతూ ఉండడం మాత్రం అభిమానులందరికీ పీడకలలా మిగిలిపోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: