దెబ్బకు దెబ్బ అంటే ఇదేనేమో.. అప్పుడు 68, ఇప్పుడు 67?

praveen
ఈ ఏడాది పేలవా ప్రదర్శనతో ప్రస్థానం మొదలు పెట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. వరుసగా రెండు పరాజయల పాలు అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ లో కొత్త ఆటగాళ్లు వచ్చిన అదృష్టం మాత్రం కలిసి రాలేదు అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ కు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ ఓటముల పరంపర కొనసాగించడం మొదలు పెట్టింది. ఇటీవలే వరుస ఓటముల లో హ్యాట్రిక్ కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్.  ఎక్కడా కనీస పోటీ ఇవ్వకపోవడంతో చివరికి బెంగళూరు జట్టుకు విజయం ఖాయం గా మారిపోయింది. అయితే 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బెంగళూరు జట్టు ప్రతీకారం తీర్చుకుంది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

 ఎందుకంటే ఏప్రిల్ 23వ తేదీన సాయంత్రం ఏడున్నర గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ బెంగళూరు జట్టును కట్టడి చేసింది. ఈ క్రమంలోనే కేవలం 68 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు జట్టు 16.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది.  తర్వాత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 9 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసి విజయం సాధించింది.  ఇక ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఒకప్పుడు తమను 68 పరుగులు కట్టిన సన్రైజర్స్ జట్టు ఫై ఇప్పుడు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది బెంగళూరు జట్టు. దీంతో దెబ్బకు దెబ్బ కొట్టింది అని అనుకుంటున్నారు అందరూ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: