వారెవ్వా దినేష్ కార్తీక్.. స్ట్రైక్ రేట్ 375.. వామ్మో?
గతంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టులో కొనసాగిన సమయంలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉండడం గమనార్హం. అసలు సిసలైన ఫినిషర్ అంటే ఎలా ఉంటాడో దినేష్ కార్తీక్ తన ఆటతీరుతో నిరూపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అతని ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోవడం ప్రతి ఒక్కరి వంతవుతుంది.
ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి అరుదైన ప్రదర్శన చేశాడు దినేష్ కార్తీక్. ఏకంగా చివర్లో వచ్చి 8 బంతుల్లోనే ఒక ఫోర్ నాలుగు సిక్సర్ల సహాయంతో 30 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అతని స్ట్రైక్ రేట్ 375 కావడం గమనార్హం. కెప్టెన్ డుప్లెసిస్ 73 పరుగులతో నాటౌట్గా నిలువగా.. అతనికి తోడుగా ఆఖర్లో దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ అటు బెంగళూరు జట్టుకు భారీ స్కోరు అందించగలిగారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యర్థి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 193 పరుగులను నిర్దేశించారు. చివరికి ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.