అప్పుడు పక్కన పెట్టారు.. ఇప్పుడు అతనే అదరగొట్టాడు?
సరైన ప్రదర్శన చేయడం లేదు అంటూ అతన్ని దాదాపు ఏడు మ్యాచ్ లకు దూరంగా ఉంచింది రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం. కానీ ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన ఇన్నింగ్స్ ఆడాడు యశస్వి జైస్వాల్. కేవలం భారీగా పరుగులు చేయడమే కాదు జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడో విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది అని చెప్పాలి.
కాగా యశస్వి జైస్వాల్ ను ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా నాలుగు కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. ఇక తుది జట్టులో కూడా అవకాశం వచ్చినప్పటికీ మూడు మ్యాచ్ లలో కూడా నిరాశ పరిచాడు యశస్వి జైస్వాల్. 20,1, 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాత మ్యాచ్ లకు అతని పక్కన పెట్టేశారు. ఇలా ఏడు మ్యాచ్ ల తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసిన యశస్వి జైస్వాల్ కసితో ఇన్నింగ్స్ ఆడాడు.. తన ఆటతో మెరిశాడు. దీంతో ఇక తర్వాత మ్యాచ్ లలో కూడా అతని జట్టులో కొనసాగించే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది..