సారీ బ్రో.. తప్పంతా నాదే.. క్షమించు ప్లీజ్?

praveen
కొన్ని కొన్ని సార్లు క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో క్రికెటర్లు ఎంతో హుందాగా ప్రవర్తించడం అటు ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కోల్కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది. లక్నో బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ తన హుందాతనాన్ని చాటుకొని అభిమానుల మనసు దోచుకున్నాడు.


 మొన్నటికి మొన్న పంజాబ్ కింగ్స్  తో జరిగిన మ్యాచ్ లో కీపర్ క్యాచ్ తర్వాత అంపైర్ అవుట్ ఇవ్వక పోయినప్పటికీ తనంతట తాను మైదానాన్ని వీడి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అభిమానులతో ప్రశంసలు అందుకున్నాడు క్వింటన్ డికాక్. అంతే కాక ఇప్పుడు మరో సారి ఇదే హుందాతనాన్ని చాటుకుని మన్ననలు అందుకుంటున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్  లక్నో సూపర్  జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది లక్నో. అయితే తొలి బంతికే సమన్వయ లోపం కారణంగా కె.ఎల్.రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా ని డైమండ్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.


 తొలి బంతిని కవర్స్ లో కి ఆడిన క్వింటన్ డికాక్ సింగిల్ కు రావాల్సిందిగా మరో ఎండ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ని పిలిచాడు. అయితే కేఎల్ రాహుల్ పిచ్ మధ్య వరకూ వచ్చాడు. అయితే బంతి శ్రేయస్ అయ్యర్  చేతుల్లోకి వెళ్ళిపోయింది  దీంతో రాహుల్ ను వెనక్కి వెళ్లాల్సిందిగా క్వింటన్ డికాక్ సూచించాడు. దీంతో అప్రమత్తమైన కె.ఎల్.రాహుల్ తిరిగి క్రీజులోకి చేరుకునే ప్రయత్నం చేశాడు. కానీ శ్రేయస్ అయ్యర్ త్రో విసిరి వికెట్లను తీశాడు. దీంతో ఇక కేఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్ అయ్యాడు. తన వల్లే రాహుల్ రనౌట్ అయ్యాడు అని క్వింటన్ డికాక్ బాధపడ్డాడు. స్ట్రాటెజీక్ టైం అవుట్ సమయంలో మైదానంలోకి వచ్చిన రాహుల్ ను క్షమించాలి అంటూ కోరాడు క్వింటన్ డికాక్. దీనిపై పెద్ద మనసుతో చేసుకుని రాహుల్ క్వింటన్ డికాక్ ను హగ్ చేసుకుని పర్వాలేదు అన్నట్టుగా చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటో ఫైనల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: