అతని టీమిండియా లోకి తీసుకోండి : హర్భజన్
ఇక ఏదో ఒక మ్యాచ్ కు మాత్రమే ఇది పరిమితం అయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా వేగాన్ని ఎక్కడ తగ్గించకుండా అంతకంతకు వేగం పెంచుతూ బంతులు వేయడంలో వైవిధ్యాన్ని చూపుతు అందరినీ తన ప్రతిభతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా అతని భారత జట్టులోకి ఎంపిక చేయాలి అంటూ ఎంతో మంది భారత మాజీ క్రికెటర్లు ఇప్పటికే భారత సెలెక్టర్లకు సూచించారు అన్న విషయం తెలిసిందే. కేవలం భారత క్రికెటర్లే విదేశీ క్రికెటర్లు సైతం ఇదే డిమాండ్ తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పుడు ఇలా డిమాండ్ చేస్తున్న వారి లిస్టులో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చేరిపోయాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న టి20 వరల్డ్ కప్ కీ ఉమ్రాన్ మాలిక్ ను భారత జట్టుకు ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ డిమాండ్ చేయడం గమనార్హం. ఇమ్రాన్ మాలిక్ నా ఫేవరెట్ బౌలర్. నేను అతడిని భారత జట్టులో చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఒక అద్భుతమైన ఫేస్ బౌలర్. ఇక ప్రతి మ్యాచ్లో కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. అంత స్పీడ్ తో బౌలింగ్ చేసే ఏ బౌలర్ కూడా జాతీయ జట్టుకు ఆడకుండా లేడు. అతను తన ప్రదర్శన తో చాల మంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతన్ని సెలక్టర్లు ఎంపిక చేస్తారో లేదో తెలియదు. కానీ ఒకవేళ తాను సెలక్షన్ కమిటీలో ఉంటే మాత్రం తప్పకుండా అతని ఎంపిక చేస్తా.. జస్ప్రిత్ బూమ్రా కు అతను సరైన జోడి అంటూ హర్భజన్ వ్యాఖ్యానించాడు.