కోహ్లీ గురించి.. బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు?
ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే బెంగళూరు జట్టు విజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్ స్టార్ ఆల్ రౌండర్ బ్రావో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ క్రమంలోనే ఒక పోస్టు చేశాడు. ఇక ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ప్రస్తుతం పేలవమైన ఫామ్ లో కొనసాగుతూ 11 మ్యాచుల్లో కేవలం 215 పరుగులు మాత్రమే చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే బ్రావో కోహ్లీ కి అండగా నిలుస్తూ పోస్టు పెట్టాడు. జీవితాన్ని ఆస్వాదించండి అలాగే గొప్ప వ్యక్తులను అభినందించండి. కోహ్లీని గౌరవించండి. విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ఆటగాడు.. నెంబర్లు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు.. అతడు ఒక ఛాంపియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఇది చూసిన కోహ్లీ అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. ఈ పోస్ట్ కి రెండు లక్షలకు పైగానే లైకులు వచ్చాయి.