రోహిత్ శర్మ గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ?

praveen
ఇటీవలి కాలంలో ఐపీఎల్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా ఐపీఎల్ లో సెలెక్ట్ కావడం గమనార్హం 1.7 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జట్టు అతని కొనుగోలు చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులందరూ ఎంతగానో మురిసిపోయారూ. ఇక తిలక్ వర్మ పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అన్న దానిపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అంచనాలకు మించి తిలక్ వర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో రాణిస్తున్నాడు అని చెప్పాలి.


 ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైతూ ఉన్నప్పటికీ కూడా తిలక్ వర్మ మాత్రం ప్రతి మ్యాచ్ లో బాగా పరుగులు చేసి సత్తా చాటుతున్నాడు. అటు భారత సెలెక్టర్లు చూపును కూడా ఆకర్షిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇటీవలే ముంబై ఇండియన్స్ లోకి రావడం పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి టీ20 క్రికెట్ మెగా లీగ్ ఆరంగేట్రం మ్యాచ్ లోనే టోఫీ అందుకోవడం ఆత్మవిశ్వాసం నింపింది అంటు తెలిపాడు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఆటను పూర్తిగా ఆస్వాదించాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. రోహిత్ ఆట తీరు అంటే ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాను.


 అలాంటి రోహిత్ భాయ్ దగ్గర నుంచి అరంగేట్రం మ్యాచ్లోనే  టోపీ అందుకోవడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి లోను కావద్దని రోహిత్ చెబుతూ ఉంటాడు.  నీ ఆట నువ్వు ఎలాగైతే ఆస్వాదిస్తూ ఆడతావో.  ఇప్పుడు కూడా అలాగే ఆడు. నువ్వు ఇప్పుడు కుర్రాడివి.. ఇది ఆస్వాదించాల్సిన సమయం ఒకవేళ అది నువ్వు కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు.  కాబట్టి నీ ఆట ఆస్వాదిస్తే  సానుకూల ఫలితాలు వస్తాయి అంటూ రోహిత్ ఎంతో విలువైన సలహాలు ఇచ్చాడూ. రోహిత్ శర్మ చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. బయట కూడా జీవితంలో ఇదే అనుసరిస్తున్న అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: