
చెన్నై పై విజయంతో.. 4వ స్థానానికి బెంగుళూరు?
ఇటీవలే మెగా వేలం కారణంగా ఎంతోమంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంతో అటు బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో పటిష్టంగా కన్పిస్తోంది. అయితే మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక గత కొన్ని రోజుల నుంచి మాత్రం వరుస ఓటములతో సతమతమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించాలని అనుకుంది. చివరికీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇటీవలే పూణే వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 13 పరుగుల తేడాతో విజయం సాధించి రన్ రేట్ ని కూడా మరింత మెరుగు పరుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ కాన్వే 56 రుతురాజ్ 28 మంచి ఆరంభం ఇచ్చిన మిగతా బ్యాట్స్మెన్లు మాత్రం విఫలమయ్యారు. ఇక చివర్లో ధోనీ ఉన్నాడు అని నమ్మకం ఉన్నప్పటికీ ధోనీ కూడా అవుట్ కావడంతో ఇక ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి దూసుకుపోయింది బెంగళూరు జట్టు.