ఐపీఎల్ లో అతిపెద్ద సిక్స్.. ఎన్ని మీటర్లో తెలుసా?

praveen
ఇటీవల ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్  గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్  బ్యాట్స్మెన్లు ఎంతలా విజృంభించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో  బరిలోకి దిగిన పంజాబ్.. నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇక లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతూ టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది పంజాబ్.

 ఈ క్రమంలోనే ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ 62 పరుగులతో మంచి ఓపెనింగ్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన రాజకప్ప 40 పరుగులతో రాణించాడు  ఇక చివర్లో వచ్చిన లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ప్రతి బంతిని సిక్సర్ గా మలుస్తూ అటు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. మహ్మద్ షమి బౌలింగ్లో సిక్సర్లతో విరుచుకుపడిన లివింగ్ స్టోన్ కొట్టిన సిక్సర్ ఏకంగా 117 మీటర్ల దూరంలో పడింది. దీంతో ఈ సిక్సర్ తో ఒక అరుదైన రికార్డు సాధించాడు.

 ఇప్పటివరకు  2022 ఐపీఎల్ సీజన్ లోనే లాంగెస్ట్ సిక్సర్  నమోదయింది అన్నది తెలుస్తుంది. అంతకుముందు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ డెవల్ట్ బ్రెవిస్, పంజాబ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ 112 మీటర్ల సిక్సర్లు కొట్టి అదరగొట్టారు. ఇక ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ 117 మీటర్లు సిక్సర్ కొట్టాడు లివింగ్ స్టోన్. అది కూడా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున కొనసాగుతున్న మొహమ్మద్ షమీ బౌలింగులో ఇక ఈ భారీ సిక్సర్ కొట్టడం గమనార్హం. ఈ భారీ సిక్సర్ కు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: