ఐపీఎల్: ఆ ఒక్క తప్పే రాజస్థాన్ ను బలిగొంది ?
మొదటి నుండి స్కోర్ బోర్డ్ నెమ్మదిగానే సాగుతోంది. స్లో గా ఆడుతున్న ఓపెనర్ పడిక్కల్ మూడవ ఓవర్ లో ఉమేష్ కు రిటర్న్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శాంసన్ మరియు బట్లర్ లు నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 48 పరుగులు జోడించారు. తర్వాత 13 ఓవర్ కు 90 పరుగుల వద్ద కరున్ నాయర్ ఔట్ అయ్యాడు.. ఆ సమయంలో ఇన్ ఫార్మ్ బ్యాట్స్మన్ అయిన శిమ్రాన్ హెట్ మెయిర్ ను పంపించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో పరాగ్ వచ్చాడు. కానీ ఇతను ఎక్కువ బాల్స్ వృదా చేయడంతో స్కోర్ బోర్డ్ పెరగలేదు మరియు చివరికి వచ్చే సరికి హెట్ మెయిర్ కు ఎక్కువ బంతులు ఆడే ఛాన్స్ రాలేదు.
అప్పుడే హెట్ మెయిర్ బ్యాటింగ్ వచ్చి ఉంటే శాంసన్ పై ఒత్తిడి తగ్గేది... స్కోర్ కూడా మరో 30 జత అయి ఉండేది. ఇది రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. కేకేఆర్ లాంటి హిట్టర్స్ ఉన్న జట్టుతో డిఫెండింగ్ చేసేటప్పుడు స్కోర్ మరీ 152 అయితే చాలా కష్టం. మరో 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కేవలం బ్యాటింగ్ కోచ్ ఒక్కడే నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి కీలక సమయంలో చిన్న చిన్న తప్పిదాలతో మ్యాచ్ లు ఓడిపోతే ప్లే ఆఫ్ చేరడం కష్టతరం అవుతుంది. మరి రానున్న మ్యాచ్ లలో అయినా రాజస్థాన్ ఈ మిస్టేక్స్ ను అధిగమించి విజయాలను సాధిస్తుందా చూడాలి.