ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా.. ఇప్పుడు చాన్స్ దొరికింది : రింకు సింగ్
ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మరో క్రికెటర్ ఒక అద్భుతమైన ప్రతిభతో తెర మీదికి వచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కోల్కతా నైట్రైడర్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన యువ ఆటగాడు రింకు సింగ్ అందరి దృష్టిని ఆకర్షించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు విజయం సాధించిన అనంతరం మాట్లాడిన రింకు సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇలాంటి అవకాశం కోసం దాదాపు గత ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ యువ ఆటగాడు. ఎట్టకేలకు అవకాశం రావడంతో ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. ఇక ఈ స్థాయికి రావడానికి తాను ఎంతగానో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు రింకు సింగ్. గాయం నుంచి కోలుకుని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగ్ 23 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడూ ఈ ప్లేయర్..