గెలుపు తర్వాత.. కెప్టెన్ ధోనీ ఏమన్నాడో తెలుసా?
కానీ ఊహించని రీతిలో రవీంద్ర జడేజా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. జడేజాను కెప్టెన్ గా మార్చి అటు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తప్పు చేసింది అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. అయితే ఇక ఇటీవల కెప్టెన్సీ భారాన్ని మోయలేక పోయిన రవీంద్ర జడేజా మళ్ళీ తిరిగి కెప్టెన్సి మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగిస్తున్నాను అంటూ తెలిపాడు. దీంతో ఎంతో మంది అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ధోని కెప్టెన్ గా వచ్చిన తర్వాత సిఎస్కె ఫేట్ మారిపోతుంది అని అందరూ భావించారు.
కెప్టెన్ మారినంత మాత్రాన ఎలాంటి మ్యాజిక్ జరగదు అని మరి కొంతమంది వాదన వినిపించారు. కానీ ధోని కెప్టెన్ గా వచ్చాడో లేదో ఎంతో అలవోకగా విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. విజయం తర్వాత మాట్లాడిన మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా జట్టుకు కెప్టెన్ ను మార్చినంత మాత్రాన అన్ని మారిపోతాయని తాను అనుకోవడం లేదని ధోని అన్నాడు. ఏ జట్టు గెలవాలన్న డిఫెండింగ్ చేయడానికి మంచి టార్గెట్ కావాలని చెప్పుకొచ్చాడు. మంచి ఏరియాలలో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది అని మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. సన్రైజర్స్ మ్యాచ్ లో మా జట్టు బ్యాట్స్మెన్ లు మంచి టార్గెట్ నిర్దేశించారు అంటూ ధోని చెప్పుకొచ్చాడు..