అంతా అయిపోయాక ఇప్పుడెందుకో.. రోహిత్ పై ఫాన్స్ ఫైర్?

praveen
ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత సీజన్ వరకు ఐపీఎల్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగిన ముంబై ఇండియన్స్ ఇక ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మెగా వేలం కారణంగా అటు ఎంతోమంది కీలక ఆటగాళ్లు జట్టు నుండి వెళ్లిపోవడంతో చివరికి ముంబై ఇండియన్స్ కి క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి  అదే సమయంలో ఇక జట్టులోని ఆటగాళ్లు కూడా పేలవా ఫామ్  కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక ప్రతి మ్యాచ్లో కూడా ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేక ఓటమి చవి చూస్తుంది ముంబై ఇండియన్స్ జట్టు.



 అయితే ముంబై ఇండియన్స్ ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తుంది అని సగటు అభిమాని ఊహించి ఉండడు. ఇప్పుడు చూసిన తర్వాత జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్ అన్నింట్లో కూడా ఓటమి పాలయింది  ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి  ఇక ఇప్పుడు గెలిచిన కేవలం పరువు నిలబెట్టుకోవడానికి తప్ప ఇంకా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో టీమిండియా సీనియర్ బౌలర్ దవల్ కులకర్ణి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక వచ్చే మ్యాచ్లోనూ అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది.

 ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉన్న కులకర్ణి ముంబై ఇండియన్స్ లోకి వచ్చిన తర్వాత విజయాలు సాధిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ముంబై ఆటగాడైన దవల్ కులకర్ణి ముంబై పిచ్ పై మంచి అవగాహన ఉండటం తో  బాగా రాణించగలడూ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలు కూడా మూసుకుపోయాయ్. అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి ఏం లాభం అంటు ముంబై ఇండియన్స్ జట్టును ప్రక్షాళన చేయాల్సిందే  రెగ్యులర్ ఆటగాళ్లు ఏం చేయలేక పోతున్నారు.. మధ్యలో వచ్చిన  కులకర్ణి గెలిపిస్తాడా అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: