మా ఓటమికి కారణం అదే : శ్రేయస్ అయ్యర్

praveen
ఈ ఏడాది భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కెప్టెన్ మారిన తర్వాత అయినా జట్టు అదృష్టం మారుతుందని అందరూ అనుకున్నారు. కెప్టెన్ మాత్రమే కాదు జట్టు ఆటగాళ్లు మారినా కూడా కోల్కత నైట్రైడర్స్ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. మొదట్లో వరుసగా విజయాలు సాధించిన కోల్కతా జట్టు ఇక ఇప్పుడు మాత్రం వరుసగా 5 పరాజయాలని నమోదు చేయడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేసర్ ముస్తాఫిజుర్ ధాటికి నిలువలేక చేతులెత్తేశారుకోల్కతా బ్యాట్స్ మెన్లు.

 ఇక ఎంత ప్రయత్నించినా నామమాత్రపు స్కోర్ కే పరిమితమైన కోల్కతాకు పరాజయం తప్పలేదు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం కోల్కత నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  స్పందిస్తూ తమ జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఓటమికి సాకులు వెతుక్కోకుండా తప్పుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చేసింది అంటూ  తెలిపాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన టాప్ ఆర్డర్ లో తరచూ మార్పులు చేయడం గాయాల కారణంగా ఆటగాళ్ల దూరం కావడం జట్టు పై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే సరైన కాంబినేషన్ సెట్ చేయలేకపోతున్నాము.

 ఏది ఏమైనా మేము మూస పద్ధతి విడిచిపెట్టి ఇకనైనా దూకుడుగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కచ్చితంగా వీటన్నింటిలోనూ రాణించాల్సిందే. మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. గతం గురించి మర్చిపోయి ముందుకు సాగుతాం అతివిశ్వాసం తో కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రతి మ్యాచ్లో ఆడుతాం.. అప్పుడు కూడా చేదు అనుభవాలు ఎదురైతే ఏం చేయలేము.. ప్రయత్నంలో లోపం ఉండ కూడదు కదా అంటూ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: