బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. కోహ్లీని పక్కన పెట్టారు?

praveen
టీమిండియా లో అటు విరాట్ కోహ్లీ  స్థానం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత అటు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ అందుకుని విరాట్ కోహ్లీ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఒక కెప్టెన్గా మాత్రమే కాకుండా జట్టుకు విజయాన్ని అందించే ఒక ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ ఎప్పుడు అద్భుతంగా రాణించాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే అటు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా ఛేదించాడు విరాట్ కోహ్లీ.



 కానీ గత కొంత కాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ భారం కారణంగానే విరాట్ కోహ్లీ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు అని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని విధంగా కెప్టెన్సీ వదులుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగి పోతాడు అనుకుంటే అదే రీతిలో పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దీంతో అభిమానులు సైతం విరాట్ కోహ్లీ ఫామ్ పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో కూడా పూర్తిగా విఫలమవుతున్నాడూ విరాట్ కోహ్లీ.



 అయితే ఇలా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో బిసిసిఐ సెలెక్టర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. కొన్నాళ్ళపాటు విరాట్ కోహ్లీ కి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా భారత్ వేదికగా సౌతాఫ్రికా తో టీ20 సిరీస్ ఆడబోతుంది. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్ వెళ్లబోతోంది. ఇక ఈ రెండు సిరీస్ లకు కూడా విరాట్ కోహ్లీని ఎంపిక చేయకుండా పక్కన పెట్టాలని అనుకుంటున్నారు. కొంతకాలం పాటు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నారట.  దీంతో జూలైలో ఇంగ్లాండ్ టూర్ లోనే విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియాతో కలవబోతున్నాడూ అన్నది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: