ధోని, కోహ్లీ.. ఉమ్రాన్ మాలిక్ గురించి ఏమన్నారో తెలుసా?

praveen
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ప్రతి బ్యాట్స్మెన్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిపోయి మెరుపు వేగంతో  బంతులు విసురుతూ అందరిని భయపెడుతున్నాడు  ఉమ్రాన్ మాలిక్. ఇక తన బౌలింగ్ వేగంతో ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక అతను టీమిండియాలో చోటు దక్కించుకుని అద్భుతంగా రాణించడంతో అతని ప్రతిభపై   మాజీ క్రికెటర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని విరాట్ కోహ్లీ లు ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలకు ఉమ్రాన్ మాలిక్ పొంగిపోయాడు అంటూ అతడి తండ్రి ఇటీవలే గుర్తు చేసుకున్నాడు.

 టీమిండియా జట్టులో ఉమ్రాన్ మాలిక్ ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతాడు అని విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోనీ లు చెప్పినట్లు ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ వివరించారు. కోహ్లీ ధోని లాంటి దిగ్గజ ఆటగాళ్లు తన కుమారుడితో ఏం చెప్పారో ఆ విషయాలను అతడు నాతో పంచుకున్నాడు.  నా కుమారుడు టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతాడు అని వారు చెప్పినట్లు నా కుమారుడు నాతో చెప్పాడు. ఈ విషయం నాతో చెప్పేటప్పుడు అతడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు. ఇద్దరు దిగ్గజాల నుంచి అంత గొప్ప మాటలు వచ్చేసరికి ఎంతగానో సంబరపడిపోయాడు అంటూ అబ్దుల్ రషీద్ చెప్పుకొచ్చాడు.

 అలాగే తన కుమారుడిని టీమిండియాలో చూడాలని కోరుకుంటున్నాను అంటూ మనసులో మాట బయట పెట్టాడు. అంతే కాకుండా ఏదో ఒక రోజు ప్రపంచ కప్ ఆడే టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకుంటాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. దీని కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అతను ఖచ్చితంగా నా నమ్మకాన్ని నిలబెడతాడు అంటు ధీమా వ్యక్తం చేశాడు. ఇక దేశం గర్వపడే స్థాయికి ఎదుగుతాడు అంటూ ఆకాంక్షించాడు ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్.  ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ చూస్తూ ఉంటే  టీమిండియాలో తొందర్లోనే చోటు దక్కించుకోవడం ఖాయం అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: