అరుదైన రికార్డు.. ఐపీఎల్ లో మూడో ఆటగాడిగా రియాన్ పరాగ్?

praveen
ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి ఎంత ఉత్కంఠభరితంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో అలవోకగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు  కానీ ఊహించని రీతిలో టార్గెట్ చేదించడం కాదు   29 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేసిన సమయంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ అటు జట్టును ఆదుకున్నాడు అని చెప్పాలి. కానీ గత నాలుగు సీజన్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు 37 మ్యాచ్లు ఆడగా.. రియాన్ పరాగ్  387 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

 కానీ ఇటీవలే మాత్రం పీకల్లోతు కష్టాల్లో జట్టు మునిగిపోయిన సమయం లో చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ ఆడాడు. 32 పరుగుల వద్ద హసరంగా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పరాగ్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి అదరగొట్టిన రియాన్ పరాగ్ అటు ఫీల్డింగ్ లో కూడా నాలుగు క్యాచ్ లు అందుకుని చివరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరులో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బ్యాట్స్మెన్ పరాగ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. 50 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు నాలుగు క్యాచ్ లు అందుకున్న మూడో ప్లేయర్ గా నిలిచాడు.

 గతంలో కలిస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి దక్కన్ చార్జర్స్ పై 2011 లో జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఘనత సాధించాడు  ఆ తర్వాత గిల్ క్రిస్ట్ కింగ్స్ 11 పంజాబ్ టీం తరఫున ప్రాతినిధ్యం వహించి చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో 2012 సీజన్లో  ఘనత అందుకోవడం గమనార్హం. ఇక పోతే ఇక ఇదే మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ హర్షల్ పటేల్ రాజస్థాన్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ మధ్య గొడవ కూడా చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు  ఒక ఫోర్ కొట్టాడు రియాన్ పరాగ్. దీంతో హర్షల్ పటేల్, పరాగ్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: