గుడ్ న్యూస్ చెప్పిన డూప్లేసెస్.. షాక్ ఇచ్చిన కోహ్లీ?

praveen
ఏడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో పటిష్టంగా కనిపించింది. ఒకప్పుడు కేవలం విరాట్ కోహ్లీ ఆట పైన మాత్రమే ఆధారపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి మాత్రం వరుసగా కోహ్లీ విఫలం అవుతున్నప్పటికీ మిగతా ఆటగాళ్లు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. అయితే మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు మాత్రం వరుస పరాజయాల పాలవుతుంది. ఇదిలా ఉంటే అటు విరాట్ కోహ్లీ పేలవమైన మాత్రం అటు జట్టుకు భారంగా మారిపోతుంది అని చెప్పాలి.

 ప్రతి మ్యాచ్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి నిరాశ పరిచి వెనుదిరగడం లాంటివి చేస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లి. తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వస్తున్న విరాట్ కోహ్లీ కనీస పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలోనే ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ డూప్లేసెస్ అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు   విరాట్ కోహ్లీ ఎప్పటిలాగా మూడవ స్థానంలో కాకుండా ఓపెనర్గా బరిలోకి దిగుతాడు అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు.

 దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోయారూ. గతంలో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన సందర్భాలు ఉండడం.. సెంచరీలు కూడా చేయడంతో  ఈ సారి కూడా తిరుగులేదు అని భావించారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అదే రీతిలో నిరాశపరిచాడు. పది బంతుల్లో ఆడి 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇక ప్రసిద్ క్రిష్ణ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో అభిమానులు మరింత నిరాశలో మునిగిపోయారు. ఓపెనర్ గా వస్తున్నాడు ఇక ఈ సారి సెంచరీ చేయడం ఖాయం అని అందరూ అనుకుంటే.. కోహ్లీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: