చెన్నైతో మ్యాచ్.. గబ్బర్ ను ఊరిస్తున్న రెండు రికార్డులు?

praveen
నేడు 2022 ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించ పోతున్నారూ అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఈ రెండు జట్లు కూడా పడుతూ లేస్తూనే ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అదే సమయంలో 7 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు మ్యాచ్లలో విజయం సాధించటం గమనార్హం. పాయింట్ల పట్టికలో 8,9 స్థానాలలో కొనసాగుతూ ఉన్నాయ్ ఈ రెండు జట్లు.



 ఈ క్రమంలోనే ఇక ఈ రెండు జట్ల మధ్య నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగబోతోంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించపోతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లు కూడా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో హోరాహోరీ పోరు జరగడం ఖాయం అన్నది ప్రస్తుతం ప్రేక్షకులు అనుకుంటున్న మాట. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగడానికి ముందు పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్  ను రెండు అరుదైన రికార్డులు ఊరిస్తూ ఉండడం గమనార్హం.


 రెండు అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు. కాగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్ ద్వారా 200 మ్యాచ్ ల మైలురాయిని అందుకో బోతున్నాడు పంజాబ్కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్. ఇప్పటివరకు మహేంద్రసింగ్ ధోని, దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప మాత్రమే ఐపీఎల్ లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు 199 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన శిఖర్ ధావన్ ఇక చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో 200 మ్యాచ్ లు అందుకోబోతున్నాడు. అదే సమయంలో మరో రెండు పరుగులు చేస్తే ఆరు వేల పరుగులు పూర్తి చేసిన  ఆటగాడిగా నిలుస్తాడు. ఇక విరాట్ కోహ్లీ 6402 పరుగులతో శిఖర్ ధావన్ కంటే ముందు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: