ఐపీఎల్ మా ఫ్రెండ్ షిప్ చెడగొట్టింది : సైమండ్స్
ఐపీఎల్ లో పాల్గొంటే అటు డబ్బు తో పాటు మంచి అనుభవం కూడా వస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే సహచరులు గా ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్లో ప్రత్యర్థులుగా మారుతూ హోరాహోరీగా పోరాడుతూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇలా అంతర్జాతీయ జట్టులో స్నేహితులుగా ఉన్న వారు ఐపీఎల్ లో మాత్రం ప్రత్యర్థులుగా మారిపోతుంటారు. ఇలా మారిన సమయంలో కొన్ని కొన్ని సార్లు స్నేహితుల మధ్య కూడా చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ చెబుతున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా తన సహచర ఆటగాడితో స్నేహం చెడి పోయింది అంటూ చెబుతున్నాడు.
ఐపీఎల్ లో ఇచ్చిన డబ్బు కారణంగా తన సహా ఆటగాడు మైకేల్ క్లార్క్ తో స్నేహం పూర్తిగా పాడైపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మైకెల్ క్లార్క్ కంటే నాకు ఎక్కువ డబ్బు ఇవ్వడం అతనికి నచ్చలేదు. అందుకే ఆస్ట్రేలియాకు ఆడుతున్న సమయంలో అతడు నాతో మాట్లాడటం పూర్తిగా మానేసాడు అంటూ ఆండ్రూ సైమండ్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ఆండ్రూ సైమండ్స్ దక్కాన్ చార్జెస్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. మైకేల్ క్లార్క్ పూణే వారియర్స్ తరపున ఆడటం గమనార్హం.