కోహ్లీ, రోహిత్ లకు.. షాకిచ్చిన కె.ఎల్.రాహుల్?
లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్సీలో కాస్త అనుభవం ఉన్న కె.ఎల్.రాహుల్ కు కెప్టెన్సీ కూడా అప్పగించింది. ఇకపోతే ఇక ఒకవైపు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడమే కాదు మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం భారత క్రికెటర్లు అందరూ పేలవమైన ప్రదర్శన కనపరుస్తూ ఉన్న సమయంలో కె.ఎల్.రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. వరుసగా సెంచరీలతో రెచ్చిపోతున్నాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే అభిమానులందరూ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
ఇక ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా లక్నో ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా మరోసారి సెంచరీతో అదరగొట్టాడు కె.ఎల్.రాహుల్. ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టి 20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశాడు. ఇక కె.ఎల్.రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ లో రెండు ఐపీఎల్ లో నాలుగు సెంచరీలు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్మన్గా కూడా నిలిచాడు రాహుల్ కోహ్లీ ప్రస్తుతం 5 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.