ఐపీఎల్ : వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్ వీళ్లే?

praveen
సాధారణంగా టీ-20 ఫార్మెట్లో కేవలం బ్యాట్స్ మెన్ లది మాత్రమే  ఆధిపత్యం మాత్రమే కొనసాగుతుంది అని చెబుతూ ఉంటారు. వన్డే, టెస్టు ఫార్మాట్లో ఆచితూచి ఆడే బ్యాట్స్మెన్లు టి-20 ఫార్మెట్లోనూ మాత్రం చితక్కొట్టుడు కొడతారు అని అంటూ ఉంటారు. నిజంగానే క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు ఫోర్లతో అటు బౌలర్లపై విరుచుకుపడుతూ వుంటారు. స్కోరు బోర్డును అడుగులు పెట్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు బ్యాట్స్మెన్ను కట్టడి చేయడం ప్రతి బౌలర్ కి పెద్ద సవాల్తో కూడుకున్నది అని చెప్పాలి. ఇకపోతే ఇలా టీ20 ఫార్మాట్లో ఇక బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ లపై  ఆధిపత్యం సాధించడం ఎక్కువ వికెట్లు పడగొట్టడం కోసం ఇక కెరీర్లోనే ఉత్తమప్రదర్శన చేయాల్సి ఉంటుంది.


 ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది టీ-20 ఫార్మెట్లో ఆధిపత్యం చెలాయించి అరుదైన రికార్డులు సాధించిన బౌలర్లు ఉన్నారు. ఇక బిసిసిఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా బ్యాట్మెన్ పై పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు కూడా చాలామంది ఉన్నారు. అద్భుతమైన బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర వహించడమే కాదు రికార్డులు కొల్లగొట్టారు ఆయా బౌలర్. ఇలా ఐపీఎల్ లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శ్రీలంక ప్లేయర్ లసిత్ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు.


 కేవలం 70 మ్యాచ్ లలోనే 100 వికెట్లు తీసిన వీరుడిగా కొనసాగుతూ ఉన్నాడు. లసిత్  మలింగా బౌలింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 81 మ్యాచ్ లలో  వంద వికెట్లు తీసిన బౌలర్ గా రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ 83 మ్యాచ్ లలో వంద వికెట్ల  మార్కును అందుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ 83 మ్యాచ్ లలో 100 వికెట్లు తీశాడు  ఆశిష్ నెహ్రా 83 మ్యాచ్ లలోనే 100 వికెట్లు పడగొట్టాడు. ఇక అమిత్ మిశ్రా 83 మ్యాచుల్లో వంద వికెట్లు మార్క్ ని అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: