ఏప్రిల్ 23.. RCB మర్చిపోలేని రోజు.. ఎందుకంటే?

praveen
ప్రతి ఏడాది కప్పు గెలుస్తుంది అని భారీ అంచనాలతో బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిరాశ పరుస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మొదట్లో వరుస విజయాలు సాధించిన జట్టు ఆ తర్వాత మాత్రం చతికిలపడి పోతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం జట్టు ఎంతో పటిష్టంగా కనిపించడంతో కప్పు పట్టడం పక్క అని అందరూ అనుకున్నారు. మంచి జోరు మీద ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో బెంగళూరు జట్టుకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం తెరమీదికి వస్తూ ఉండడం గమనార్హం.


 సాధారణంగా ప్రతి సీజన్లో కూడా గ్రీన్ జెర్సీ ధరించి బెంగళూరు జట్టు ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. పచ్చదనాన్ని పెంపొందించడం పర్యావరణాన్ని కాపాడం అని మెసేజ్ ఇవ్వడానికి ఇలా గ్రీన్ జెర్సీ ధరిస్తూ ఉంటుంది బెంగళూరు. ఈ గ్రీన్ జెర్సీ జెర్సీ తో ఆడిన ప్రతీ మ్యాచ్ బెంగళూరు ఓడిపోతుందని ఒక బాడ్ సెంటిమెంటు ఉంది. ఇక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమి తరువాత ఇలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ తెరమీదికి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏప్రిల్ 23 మర్చిపోలేనిది అభిమానులు ఒక ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు.


 ఎందుకంటే సరిగ్గా ఏప్రిల్ 23వ తేదీ ని రెండుసార్లు అత్యల్ప స్కోరు ఓసారి అత్యధిక స్కోరు నమోదు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. 2017 ఐపీఎల్ సీజన్ లో ఏప్రిల్ 23వ తేదీన కోల్కత నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో తమ ముందు ఉన్న 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు జట్టు 49 పరుగులకే కుప్పకూలింది. ఇది ఐపీఎల్ లోనే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక నిన్న సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఈ ఏడాది టోర్నీలో ఇదే అత్యల్ప స్కోరు. 2013లో పూణే జట్టు పై 263 పరుగులు చేసింది ఆర్సిబి. ఇక ఇదే ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: