హార్దిక్ ధోనీ నుంచే నేర్చుకున్నాడు : గవాస్కర్
ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తు చేస్తూ దూసుకుపోతుంది గుజరాత్. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీని తో మాయ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. అది కూడా అతి కష్టం మీద. దీంతో కోల్కతా చేతిలో గుజరాత్ ఐటమ్స్ ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ బౌలింగ్ రొటేట్ చేస్తూ బ్యాట్స్మెన్లను కన్ఫ్యూజ్ చేసిన హార్దిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడు.
దీంతో చిన్న టార్గెట్ ని కాపాడుకుంటూ చివరికి 8 పరుగుల తేడాతో విజయం సాధించాడు. అయితే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటుతూ ఉండడంపై మాజీ క్రికెటర్ భాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా పెద్దగా క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు మనం కొత్త హార్దిక్ పాండ్యాను చూస్తున్నాం. అతను ఎంతో మెరుగు పడ్డాడు. వివిధ రకాల పరిస్థితులకు చక్కగా రాణిస్తున్నాడు. 4ేవస్థానంలో ఎంతో బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ధోని నుంచి హార్దిక విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. ధోని ఇలాంటి గొప్ప ఆటగాళ్లతో సహవాసం ఎప్పుడు మేలు చేస్తుంది. అది హార్థిక్ పాండ్యాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాండ్య బ్యాటింగ్లో క్రమశిక్షణ కనిపిస్తోంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.