ఐపీఎల్ : అంపైర్ను పచ్చి బూతులు తిట్టిన బ్యాట్స్మెన్?

praveen
మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అంటే చాలు ఆటగాళ్లు ఆగ్రహంతో ఊగివటం లాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకంటే మ్యాచ్ లో జరిగే చిన్న పొరపాట్లు ఏకంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రేక్షకులందరికీ క్రికెట్ ఎంటర్ టైన్మెంట్ పంచుతూన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గత కొన్ని మ్యాచ్ ల నుండి అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక తప్పుడు నిర్ణయాలతో అంపైర్లు  నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.


 ఇకపోతే ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అనే విషయం తెలిసిందే. ఎవరు విజయం సాధిస్తారన్నది చివరి వరకు ఊహకందని విధంగానే మారిపోయింది   లక్నో స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా అంపైర్ ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఏం జరిగిందంటే మ్యాచ్ లో భాగంగా 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగింది లక్నో జట్టు.


 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే 34 పరుగులు కావాల్సిన సమయం లో క్రీజులో స్టార్ ఆల్రౌండర్ స్టోయినిస్ ఉన్నాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇక మరో వైపు జాసన్ హోల్డర్ 9 బంతుల్లో 16 పరుగులు చేసి దాటగానే ఆడుతూ ఉన్నారు. దీంతో ఇక లక్నో జట్టు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇక 19 ఓవర్ వేయడానికి హాజిల్ వుడ్ రాగా స్ట్రైక్ లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడూ. తొలి బంతినే ఆఫ్ స్టంప్ కు దూరంగా వేసాడు. వాస్తవానికి దానిని వైడ్ గా ప్రకటించాలి. అయితే అంపైర్ మాత్రం వైడ్ గా ప్రకటించలేదు. దీంతో ఆశ్చర్యపోయిన స్టోయినిస్ నవ్వాడు. అయితే ఆ తర్వాత బంతికే అతను వికెట్ల మీద నుంచి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చివరికి బౌల్డ్ అయ్యాడు. దీంతో  సహనం కోల్పోయిన స్టోయినిస్ అసభ్య పదజాలంతో అంపైర్ను  దూషించాడు. ఇది మైక్ లో క్లియర్గా రికార్డయింది. దీనికి సంబంధించిన  వీడియో కూడా వైరల్ గా మారిపోయింది. స్టోయినిస్ అలా అనడంతో రిఫరీలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: