బ్యాట్స్మెన్ హెల్మెట్ కొట్టడం ఇష్టం : ఉమ్రాన్ మాలిక్
కేవలం వేగంతో బంతులు విసిరటమే కాదు టెక్నిక్ కూడా ఉపయోగిస్తూ వికెట్లు పడగొడుతూ ఉన్నాడు. ఇలా ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలో ఇమ్రాన్ మాలిక్ రాణిస్తున్న తీరు ఎంతో అద్భుతం అని చెప్పాలి. ఇక ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు సైతం ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతనిలో ఎంతో టాలెంట్ దాగి ఉందని వెంటనే టీమిండియాకు సెలెక్ట్ చేయాలి అంటూ కోరుతున్నారు మాజీ క్రికెటర్లు. ఇలా ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ స్పీడ్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సన్రైజర్స్ ఏ జట్టు తో తలపడినప్పటికీ ఉమ్రాన్ మాలిక్ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసిరే బౌలర్ కనిపించడం లేదు.
ఇటీవలే తన స్పీడ్ బౌలింగ్ గురించి ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే మ్యాచ్ లలో ఇంకా వేగంగా బౌలింగ్ వేస్తానని చెబుతున్నాడు ఈ యువ బౌలర్. స్లో డెలివరీలు, నకుల్ బాల్స్ వేసేందుకు కూడా ప్రయత్నిస్తాను అంటూ చెబుతూ ఉన్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యం అంటూ మనసులో మాట బయట పెట్టాడు. ఇక బ్యాట్స్మెన్లు హెల్మెట్ ను కొట్టడమే తన లక్ష్యం అంటూ చెబుతూ ఉన్నాడు. టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా తనకు స్ఫూర్తి అంటూ చెబుతూ ఉన్నాడు ఉమ్రాన్ మాలిక్. ఇప్పటికే వేగంతో అందరిని బెంబేలెత్తిస్తున్న ఉమ్రాన్ మాలిక్ ఇక కాస్త టెక్నిక్ నేర్చుకున్నాడు అంటే అతనికి తిరుగు ఉండదు అని అందరూ చెబుతున్న మాట.