చాహల్ చాంగుభలా.. కోల్కతా విలవిల?
అలా అనుకుంటే ఎలా.. ఇటీవలే చాహల్ రాణించిన తీరు చూస్తుంటే అతని గురించి చెప్పకుండా అస్సలు ఉండలేము. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. నాకు తెలిసి ఇప్పటివరకు ఐపీఎల్లో ఇంతకంటే ఆసక్తికర పోరు జరగలేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. ఒకవైపు బట్లర్ సూపర్ సెంచరీతో అదరగొట్టగా.. యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ ప్రదర్శన తో రాజస్థాన్ కు విజయం అందించాడు. ఆరు వికెట్లు 20 బంతుల్లో 40 పరుగులు చేస్తే కోల్కతా విజయం సాధిస్తోంది. అలాంటి సమయంలోనే బంతిని అందుకున్నాడు చాహల్.
స్పిన్ బౌలింగ్ తో అద్భుతమే సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 17 ఓవర్లలో చాహల్ కు ఏకంగా నాలుగు వికెట్లు దక్కాయి. కోల్కతా జట్టు విజయావకాశాలను నుంచి ఓటమి బాట పట్టింది. ఇక మొత్తంగా ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు చాహల్. చాహల్ సాధించిన 5 వికెట్ల గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఇక చివరికి 7 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. 17 ఓవర్లలో చివరి మూడు బంతుల్లో శ్రేయస్ అయ్యర్, శివ మావి, కమ్మిన్స్ లను అవుట్ చేసి ఇక చాహల్ మరోసారి తన బౌలింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.